Hyderabad: భూలక్ష్మి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షపురం ప్రాంతంలో ఉన్న భూలక్ష్మి ఆలయంలో సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
By అంజి Published on 27 Aug 2024 9:55 AM ISTHyderabad: భూలక్ష్మి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షపురం ప్రాంతంలో ఉన్న భూలక్ష్మి ఆలయంలో సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విగ్రహం ధ్వంసం అయిన విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు..ఆలయం వద్దకు భారీగా తరలివచ్చి దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతి లాల్ పాటిల్ మాట్లాడుతూ.. ''సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి 11.30 నుండి 12 గంటల మధ్య ఈ సంఘటన జరిగింది, పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. పోలీసులు CCTV ద్వారా ట్రాకింగ్ చేయడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఇద్దరు వ్యక్తుల పేర్లు బయటపడ్డాయని తెలిపారు'' అని తెలిపారు.
"విధ్వంసానికి బాధ్యులైన వారందరినీ పట్టుకుంటాం. ప్రత్యక్షంగా బాధ్యులైన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ దాడి వెనుక రాజకీయ ఉద్దేశ్యానికి ఎటువంటి ఆధారాలు లేవు" అని ఆయన అన్నారు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం రియాసత్‌నగర్ డివిజన్, రక్షాపురం కాలనీలోని భూలక్ష్మి దేవాలయంలో జరిగినట్లు బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి తెలిపారు.
''భూలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.. స్థానిక కార్పొరేటర్, ఆయన వ్యక్తులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు.. గత ఐదేళ్లుగా జరుగుతున్నది.. ఈ ఆలయంలో ఈ సారి కూడా వినాయక మండపం వద్ద అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఆలయం పోలీస్ స్టేషన్ నుండి కేవలం 50 చదరపు గజాల దూరంలో ఉంది'' అని సురేందర్ రెడ్డి అన్నారు.