మెట్రో పిల్ల‌ర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్ద‌రు ద‌ర్మ‌ర‌ణం

Two killed as motorcycle hits Metro pillar in Hyderabad.హైద‌రాబాద్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. బైక్ అదుపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2022 4:36 AM GMT
మెట్రో పిల్ల‌ర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్ద‌రు ద‌ర్మ‌ర‌ణం

హైద‌రాబాద్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. బైక్ అదుపు త‌ప్పి మెట్రో పిల్ల‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్ర‌యాణీస్తున్న ఇద్ద‌రు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. క‌ర్ణాట‌కు చెందిన మోహిన్‌(23), ఒబేద్‌(22) ఎర్ర‌మంజిల్ నుంచి ఖైర‌తాబాద్ వైపు ద్విచ‌క్ర‌వాహ‌నం పై వెలుతున్నారు. వీరు ప్ర‌యాణిస్తున్న బైక్ సోమాజిగూడ హ‌నుమాన్ దేవాల‌యం ఎదురుగా ఉన్న మెట్రో పిల్ల‌ర్‌ను ఢీ కొట్టింది. దీంతో వీరిద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. న‌గ‌రంలోని బంధువుల ఇంటికి వీరు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. బంధువుల‌కు స‌మాచారం అందించారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story