విషాదం.. డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతి

Two GHMC workers went down into the manhole.ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని సాహెబ్‌న‌గ‌ర్‌లో విషాదం చేటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 2:24 AM GMT
విషాదం.. డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతి

ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని సాహెబ్‌న‌గ‌ర్‌లో విషాదం చేటు చేసుకుంది. డ్రైనేజీ క్లీన్ చేసేందుకు మ్యాన్‌హోల్ లోకి దిగిన ఇద్ద‌రు జీహెచ్ఎంసీ(గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌) కార్మికులు గ‌ల్లంత‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, మున్సిప‌ల్‌, అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌ల్లంతైన కార్మికుల‌ను అంతయ్య, శివ గా గుర్తించారు. వారి మృత‌దేహాల‌ను వెలికితీశారు. మ్యాన్‌హోల్ క్లీన్ చేసేందుకు వెళ్లిన వీరికి ఊపిరి అంద‌క‌పోవ‌డంతోనే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

మృతులు చంపాపేట్, సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన వారని, పారిశుధ్య పనులతోనే జీవనోపాధి పొందేవారని కుటంబసభ్యులు చెబుతున్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా మ్యాన్ హోల్‌లోకి దిగటమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి వేళలో ఇటువంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వీరి కుటుంబాలకు పరిహారం అందించాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story