Hyderabad: గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరు మృతి

హైదరాబాద్ నగరంలో వినాయక విగ్రహ తరలింపు అపశ్రుతి చోటు చేసుకుంది.

By అంజి
Published on : 19 Aug 2025 9:09 AM IST

Two electrocuted , transporting Ganesh idol, Hyderabad, Bandlaguda

Hyderabad: గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి పరిస్థితి విషమం

హైదరాబాద్ నగరంలో వినాయక విగ్రహ తరలింపు అపశ్రుతి చోటు చేసుకుంది. ఆగస్టు 18, సోమవారం రాత్రి బండ్లగూడ రోడ్డులో గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో జల్పల్లి గణేష్ మార్కెట్ నుండి ఓల్డ్‌ సిటీలోని లాల్ దర్వాజాకు ఒక పెద్ద గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్‌లో తరలిస్తుండగా , వాహనం రాయల్ సీ హోటల్ పాయింట్‌కు చేరుకున్నప్పుడు, విగ్రహం కొన ఓవర్ హెడ్ హైటెన్షన్ వైర్లకు తాకింది.

ట్రాక్టర్ పై ఉన్న అఖిల్, వికాస్ అనే ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయారు. గణేష్ విగ్రహంతో పాటు ఉన్న ఇతర వ్యక్తులు వారిని రక్షించి, గాయపడిన వారిని చికిత్స కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. ఈ ఘటనపై బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రామంతపూర్ వద్ద శ్రీకృష్ణాష్టమి రథయాత్రలో ఆరుగురు వ్యక్తులు విద్యుత్ షాక్‌తో మరణించారు.

Next Story