కవల సోదరులు కన్నుమూత.. జీడిమెట్లలో ఊహించని ప్రమాదం

హైదరాబాద్‌: జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సబూరి ఫార్మాలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోయారు.

By అంజి  Published on  17 Oct 2024 9:31 AM IST
Twin brothers, septic tank, Hyderabad, Jedimetla

కవల సోదరులు కన్నుమూత.. జీడిమెట్లలో ఊహించని ప్రమాదం

హైదరాబాద్‌: జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సబూరి ఫార్మాలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోయారు. రసాయనాల ట్యాంక్‌లో పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. ఏపీకి చెందిన రాము(32), లక్ష్మణ్‌(32)కవలలు. జీవనోపాధి కోసం వచ్చి అన్నారంలో ఉంటున్నారు. బుధవారం నాడు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంరెడ్డినగర్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తు పడి మరణించారు.

జీడిమెట్ల ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు రాము, లక్ష్మణ్‌లు సెప్టిక్‌ ట్యాంక్‌కు నట్లు, బోల్ట్‌లు తయారు చేస్తున్నారు. టీ బ్రేక్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు రాము ట్యాంక్‌లో పడిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో లక్ష్మణ్ దూకడంతో ఇద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. సబూరి ఫార్మా కెమికల్ కంపెనీ గత కొన్ని నెలలుగా మూసి ఉంది. అనుమతులు తీసుకుని పనులు చేయిస్తున్నారో లేదో తెలియాల్సి ఉంది.

Next Story