Hyderabad: మౌలాలి కమాన్‌ మీదుగా ఆర్టీసీ బస్సులు.. 10 ఏళ్ల తర్వాత

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) 3వ నంబర్ కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గాన్ని పునరుద్ధరించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Aug 2023 8:15 AM GMT
TSRTC, Kushaiguda, Afzalgunj, Moulali Kaman, Hyderabad

Hyderabad: మౌలాలి కమాన్‌ మీదుగా ఆర్టీసీ బస్సులు.. 10 ఏళ్ల తర్వాత

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో 3 వ నంబర్‌ బస్సులను పునరుద్ధరించింది. మౌలాలి కమాన్ రూట్ 10 సంవత్సరాల క్రితం మూసివేయబడింది. అప్పటి నుంచి మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ ద్వారా బస్సులు దారి మళ్లించబడ్డాయి. అయితే ఆ మార్గంలో రద్దీ పెరగడంతో, మౌలాలి కమాన్ మీదుగా బస్సులను పునరుద్ధరించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. నంబర్ 3 రూట్ బస్సు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎస్పీ నగర్, మౌలాలి కమాన్, జెడ్‌టీఎస్, లాలాపేట్, తార్నాక, శంకర్ మట్, కోటి, సీబీఎస్ మీదుగా అఫ్జల్ గంజ్‌కు వెళ్తుంది. ఈ మార్గంలో ప్రయాణీకులకు ప్రతి 20 నిమిషాలకు బస్సులు అందుబాటులో ఉంటుంది.

టీఎస్‌ఆర్టీసీ కుషాయిగూడ-అఫ్జల్ గంజ్ మార్గంలో ప్రయాణీకులను ఈ కొత్త సేవను ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది. 4 మెట్రో ఎక్స్‌ప్రెస్, 4 సిటీ ఆర్డినరీ బస్సుల ద్వారా ఈ సర్వీస్ నడపబడుతుంది. హైదరాబాద్‌లోని టీఎస్‌ఆర్‌టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ తోట శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇరుకుగా ఉండడంతో పాటు భారీ వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో దశాబ్ద కాలంగా మూతపడిన ఇరుకైన జంక్షన్ మౌలాలి కమాన్ మీదుగా నడిచే 8 బస్సులను పునరుద్ధరించాం. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ద్వారా ఈసీఐఎల్‌, తార్నాకకు వెళ్లే రహదారిని విస్తరించారు. దీని వలన బస్సులు మళ్లీ జంక్షన్ గుండా వెళ్ళే అవకాశం ఉంది.

''ఈ ప్రాంతంలో నివసించే 50,000 మందికి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. వారు గత 10 సంవత్సరాలుగా ఈ సేవను కోల్పోతున్నారు. గతంలో బస్సు ఎక్కాలంటే హౌసింగ్ బోర్డ్ కాలనీ లేదా కోకాకోలా కంపెనీకి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు, వారు మౌలాలి కమాన్ వద్ద బస్సు ఎక్కి నేరుగా ఈసీఐఎల్‌ లేదా అఫ్జల్ గంజ్‌కి ప్రయాణించవచ్చు'' ఈ బస్సుల పునరుద్ధరణ మౌలాలి, పరిసర ప్రాంతాల ప్రజలకు స్వాగతించదగిన చర్య. ఇది వారు పని, పాఠశాల, ఇతర గమ్యస్థానాలకు ప్రయాణించడాన్ని సులభతరం చేస్తుంది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

Next Story