గ్రేట‌ర్ హైద‌రాబాద్ విద్యార్థుల‌కు టీఎస్ఆర్టీసీ మ‌రో గుడ్‌న్యూస్‌

TSRTC reduces Metro Combination ticket price.టీఆర్ఎస్ ఆర్టీసీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని విద్యార్థుల‌కు శుభ‌వార్త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Nov 2022 9:42 AM IST
గ్రేట‌ర్ హైద‌రాబాద్ విద్యార్థుల‌కు టీఎస్ఆర్టీసీ మ‌రో గుడ్‌న్యూస్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఆర్ఎస్ ఆర్టీసీ) గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని విద్యార్థుల‌కు మ‌రో శుభ‌వార్త చెప్పింది. మెట్రో కాంబినేష‌న్ టికెట్ ధ‌ర‌ను త‌గ్గించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మెట్రో కాంబినేష‌న్ టికెట్ ధ‌ర రూ.20 ఉండ‌గా.. దాన్ని రూ.10కి త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. విద్యార్థుల సౌక‌ర్యార్థం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. సిటీ బ‌స్ పాస్ క‌లిగిన విద్యార్థులు మెట్రో స‌ర్వీసుల్లో ప్ర‌యాణించాలంటే ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చున‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు టీఎస్‌ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల క్రితం దూర ప్రాంతాల నుంచి నగరంలోని పలు కళాశాలలకు వచ్చే విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జారీ చేసిన బస్‌పాస్‌లను పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ఉపయోగించుకునేందుకు అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. విద్యార్థుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉప‌యోగించుకోవాల‌ని కోరింది.

Next Story