జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం
Ts High court refuses Lunch motion GHMC Election Petition .. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం తీ
By సుభాష్
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల పిల్‌పై అత్యవసరంగా విచారించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్ రొటేషన్ పద్దతి లేకుండా ఎన్నికలు నిర్వహించం చట్టవిరుద్దమని, మున్సిపల్ యాక్ట్ 52ఈ ను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ లంచ్ మోషన్‌కు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది హైకోర్టును కోరారు. ఈ పిటిషన్లపై లంచ్ మోషన్ విచారణను చేపట్టేందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ నిరాకరించారు.
మరోవైపు ఎన్నికలను ఆపాలంటూ కాంగ్రెస్ నత దాసోజీ శ్రవణ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంపై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్దంగా రిజర్వేషన్ అమలు చేశారని శ్రవణ్ తరపున న్యాయవాది ఆ పిల్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు పదేళ్ల కిందట తీర్పు ఇస్తే ఇప్పటి వరకకు ఏం చేశారని కోర్టు మండిపడింది. పిల్‌ను చేపడాతాం కానీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి నామినేషన్లు సైతం ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 1న పోలింగ్, 4న ఫలితాలను వెలువడనున్నాయి. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు ఈ నామినేషన్లను స్వీకరించారు. ఈనెల 20కన నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంది.