వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారమతిపేట సమీపంలో ఓఆర్ఆర్ పై ఘట్‌కేసర్ వైపు థమ్స్‌అప్ బాటిల్స్ లోడుతో ఓ లారీ వెలుతుండగా.. టైర్ పేలిపోయింది. దీంతో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలోని థమ్స్ అప్ బాటిళ్లు మొత్తం రోడ్డు పై పడిపోగా.. లారీ డ్రైవర్, క్లీనర్ లకు గాయాలయ్యాయి.
వెంటనే ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తమ వాహనాలను ఆపారు. డ్రైవర్, క్లీనర్లను పట్టించుకోకుండా అందినకాడికి థమ్స్అప్ బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు. క్షణాల్లోనే సరకు మొత్తాన్ని ఖాళీ చేశారు. లారీ బోల్తా పడడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంబించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. లారీని రోడ్డు పక్కకు తీసి ట్రాఫిక్‌కు క్రమబద్దీకరించారు.