జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: నగర ప్రజలకు సీఎం కేసీఆర్‌ వరాలు.. ఎన్నికల మేనిఫెస్టో విడుదల

TRS GHMC Election Manifesty .. హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల

By సుభాష్  Published on  23 Nov 2020 4:33 PM IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: నగర ప్రజలకు సీఎం కేసీఆర్‌ వరాలు.. ఎన్నికల మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో విడుదల చేసిన మేనిఫెస్టోలో గ్రేటర్‌ ప్రజలపై వరాలు కురిపించారు. డిసెంబర్‌ నుంచి నీటి బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 98 శాతం మంది ప్రజలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ధోబీఘాట్లను మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో మోటారు వాహనాల పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్‌ అందిస్తామని అన్నారు.

♦ హైదరాబాద్‌ ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా

♦ డిసెంబర్‌ నుంచి నీటి బిల్లులు రద్దు

♦ 20 వేల లీటర్ల లోపు నల్లా నీటి వినియోగం ఉచితం

♦ కరోనా కాలం నుంచి రూ.267 మోటారు వాహన పన్ను రద్దు

♦ తాగునీటి అవసరాల కోసం త్వరలో కేశవాపురంలో రిజర్వాయర్‌ నిర్మాణం

♦ సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్‌

♦ ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు మోటారు వాహన పన్ను మాఫీ

♦ పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హెచ్‌డీ, ఎల్టీ కేటగిరి విద్యుత్‌ కనెక్షన్లకు ఆరు నెలల కాలానికి మినిమం డిమాండ్‌ చార్జీలు రద్దు

♦ రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌ సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్‌ సాయం

♦ రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో షోలు పెంచుకునేందుకు అనుమతి

♦ సినిమా టికెట్ల ధరలు సవరించుకునేందుకు అనుమతి

Next Story