మహిళా డ్యాన్సర్‌ అనుమానాస్పద మృతి.. చిరిగిన బ‌ట్ట‌లు.. ప‌క్క‌నే బీర్ బాటిల్‌

Troupe Dancer Suspicious Death in Hyderabad.హైద‌రాబాద్‌లో దారుణం జ‌రిగింది. ఓ లేడీ డ్యాన్స‌ర్ అనుమానాస్ప‌ద స్థితిలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2021 11:28 AM IST
మహిళా డ్యాన్సర్‌ అనుమానాస్పద మృతి.. చిరిగిన బ‌ట్ట‌లు.. ప‌క్క‌నే బీర్ బాటిల్‌

హైద‌రాబాద్‌లో దారుణం జ‌రిగింది. ఓ లేడీ డ్యాన్స‌ర్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. ఆమె మృత‌దేహాం అర్థ‌న‌గ్నంగా ఉండ‌డం.. ప‌క్క‌నే బీరు బాటిల్ ఉండ‌డం ప‌లు అనుమానాల‌ను తావిస్తోంది. ఈ ఘ‌ట‌న ఫ‌ల‌క్‌నుమా ప‌రిధిలో చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని ప‌రిశీలించి పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతురాలిని షరీన్‌ ఫాతిమాగా గుర్తించారు.

వివ‌రాల్లోకి వెళితే.. ముస్త‌ఫాన‌గ‌ర్ కు చెందిన షరీన్‌ ఫాతిమా(30)కు ఏడుగురు సంతానం. భ‌ర్త న‌దీం మృతి చెంద‌డంతో కుటుంబాన్ని పోషించే బాధ్య‌త ఫాతిమాపై ప‌డింది. ఈ క్ర‌మంలో ఆమె ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్స‌ర్‌గా కొన‌సాగుతోంది. మూడు రోజుల క్రితం ముస్తఫానగర్‌లో ఇల్లును అద్దెకు తీసుకుంది. ఆదివారం ఇంట్లో వ‌స్తువుల‌ను షిప్ట్ చేస్తాన‌ని చెప్పి.. పిల్ల‌ల‌ను అమ్మ‌మ్మ ఇంటి వద్ద ఉంచింది. కాగా.. ఫాతిమా ఎంత‌సేప‌టికి తిరిగి రాక‌పోవ‌డంతో ఆమె త‌ల్లి కొత్త‌గా తీసుకున్న అద్దె ఇంటికి వ‌చ్చి చూడ‌గా.. ఫాతిమా మృతదేహాం క‌నిపించింది.

మృతురాలి గొంతుపై గాయాలు ఉండ‌డంతో పాటు.. అర్థ‌న‌గ్నంగా ఉండ‌డం, ప‌క్క‌నే బీరు బాటిల్ ఉండ‌డంతో హ‌త్య చేసి ఉంటార‌ని బావిస్తున్నారు. మృతురాలి సోద‌రుడు ఇచ్చిన ఫిర్యాదు ఆదారంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. గ‌తంలో తండ్రి మృతి చెంద‌డం ఇప్పుడు త‌ల్లి మ‌ర‌ణించ‌డంతో పిల్ల‌లు అనాథ‌లు మారారు.


Next Story