కర్నూలులో బస్సు ప్రమాద ఘటన తర్వాత హైదరాబాద్‌లో రవాణా శాఖ అధికారులు మూడ్రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో తొమ్మిది బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేసి రూ.18 వేలు చలానా విధించారు. ఇక రవాణ శాఖ నిబంధనలు పాటించని ఒక బస్సును అధికారులు సీజ్ చేశారు. మరో వైపు మూడ్రోజులుగా చేపట్టిన తనిఖీల్లో మొత్తం 98 బస్సులపై కేసులు నమోదు చేయగా..ఐదు బస్సులు సీజ్ చేశారు. మొత్తంగా రూ.2.04 వేలు చలానా విధించారు.
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనంతరం ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రావెల్స్ బస్సులపై తనిఖీల్లో ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి నిబంధనలు ఉల్ఘంఘించినట్టు వలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయి తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.