రేపు హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restrictions in the Hyderabad city tomorrow.నగరంలోని పలు ప్రాంతాల్లో బుధ‌వారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2021 2:00 AM GMT
రేపు హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలోని పలు ప్రాంతాల్లో బుధ‌వారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీద్‌(ఈద్‌-ఉల్‌-జుహ) ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా.. మీరాలం ట్యాంక్‌ ఈద్గా, హాకీ గ్రౌండ్‌, మాసబ్‌ ట్యాంక్‌, లంగర్‌ హౌస్‌ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయ‌ని తెలిపారు.

మీరాలం ట్యాంక్‌ ఈద్గా..

- ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారు పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌, బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్యలో ఈ రూట్లలో రావాలని సూచించారు. ఈ వాహనాలను జూపార్కు ప్రాంతంలో పార్కు చేయాలి.

- సాధారణ ట్రాఫిక్‌కు ఈద్గా రోడ్డు వైపు అనుమతి లేదు. ఈ ట్రాఫిక్‌ బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు వద్ద కిషన్‌బాగ్‌, కామాటిపురా, పురాణాపూల్‌ వైపు వెళ్లాలి.

- శివరాంపల్లి వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలకు దానమ్మ హాట్స్‌ రోడ్డు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ ట్రాఫిక్‌ను ఈద్గా వైపు అనుమతించరు. దానమ్మ క్రాస్‌రోడ్స్‌ నుంచి శాస్త్రీపురం, ఎన్‌ఎస్‌కుంట రూట్‌లలో వెళ్లాలి. యూసుఫ్‌ పార్కింగ్‌, మజార్‌ పార్కింగ్‌, జయేశ్‌ పార్కింగ్‌, మోడ్రన్‌ సా మిల్‌ పార్కింగ్‌ ఈద్గా ఎదుట ఉన్న ప్రధాన రోడ్డు, మిర్‌ అలామ్‌ ఫిల్టర్‌ బెడ్‌, యాదవ్‌ పార్కింగ్‌లలో వాహనాలు పార్కు చేయాలి.

- కాలాపత్తర్‌ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలు కాలాపత్తర్‌ ఠాణా వైపు ఉదయం 8 నుంచి 11.30గంటల వరకు అనుమతిస్తారు. సాధారణ వాహనాలను మోచీ కాలనీ, బహదూర్‌పురా వైపు మళ్లిస్తారు. ఈ రూట్‌లో వచ్చే వాహనాలు భయ్యా పార్కింగ్‌, మోడ్రన్‌ పెట్రోల్‌ బంక్‌, బీఎన్‌కే కాలనీల్లో పార్కు చేయాలి.

- ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పురానాపూల్‌ నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే భారీ వాహనాలను జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.

- ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ వైపు నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను ఆరాంఘర్‌ జంక్షన్‌ వద్ద నుంచి మళ్లిస్తారు.

లంగర్‌హౌస్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు…

- నానల్‌నగర్‌ నుంచి నుంచి ఆంధ్రాఫ్లోర్‌ మిల్‌ వైపు వెళ్లే వాహనాలను బాలిక భవన్‌ జంక్షన్‌ నుంచి లక్ష్మీనగర్‌ వైపు మళ్లిస్తారు.

- ఎండీలైన్స్‌, బాలిక భవన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను మిలిటరీ దవాఖాన వైపు అనుమతించరు. ఈ రూట్‌ వాహనాలను ఆంధ్రాఫ్లోర్‌ మిల్‌ వద్ద బాలిక భవన్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

- లంగర్‌హౌస్‌ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను మిలిటరీ దవాఖాన వైపు అనుమతించరు, ఈ వాహనాలను మొగల్‌కా నాలా వైపు మళ్లిస్తారు.

మాసబ్‌ ట్యాంక్‌ హాకీ గ్రౌండ్‌లో ప్రార్థనలు..

- మెహిదీపట్నం నుంచి మాసబ్‌ ట్యాంక్‌ మీదుగా బంజారాహిల్స్‌ రోడ్డు నం.1లోకి వెళ్లే వాహనాలను మాసబ్‌ ట్యాంక్‌ ఫ్లై ఓవర్‌, అయోధ్య జంక్షన్‌, ఖైరతాబాద్‌, తాజ్‌కృష్ణా హోటల్‌ రూట్‌లో మళ్లిస్తారు.

- రోడ్డు నంబర్‌ 12 నుంచి బంజారాహిల్స్‌ మీదుగా మాసబ్‌ట్యాంక్‌ వైపు వచ్చే బస్సులను 1/12 జంక్షన్‌ నుంచి తాజ్‌ కృష్ణ, ఖైరతాబాద్‌ రూట్‌లలో మళ్లిస్తారు.

- లక్డీకాపూల్‌ వైపు నుంచి 1/12 రూట్‌లో బంజారాహిల్స్‌ వైపు మాసబ్‌ట్యాంక్‌ మీదుగా వెళ్లే వాహనాలను అయోధ్య జంక్షన్‌, ఖైరతాబాద్‌, తాజ్‌కృష్ణ రూట్‌లలో మళ్లిస్తారు. మాసబ్‌ట్యాంక్‌ ఫ్లై ఓవర్‌ కింది రూట్‌లో ఏ వాహనాలను అనుమతించరు.

- సాధారణ వాహనాలను 1/12 నుంచి చింతల్‌బస్తీ రూట్‌లో మళ్లిస్తారు.


Next Story