అల‌ర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి-2025 కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

By Medi Samrat
Published on : 7 March 2025 4:14 PM IST

అల‌ర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి-2025 కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున పంజాగుట్ట - గ్రీన్‌ల్యాండ్స్ - బేగంపేట - సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుండి వచ్చే దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, వీలైతే ప్రత్యామ్నాయ రూట్స్ ను వాడాలని పోలీసులు కోరారు. సమావేశం సందర్భంగా అవసరాన్ని బట్టి టివోలి క్రాస్‌రోడ్స్ నుండి ప్లాజా క్రాస్‌రోడ్స్ వరకు రోడ్డు మూసివేసే అవకాశం ఉంటుంది.

చిలకలగూడ క్రాస్ రోడ్స్, అలుగడబావి క్రాస్ రోడ్స్, సంగీత్ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్స్, ప్యాట్నీ క్రాస్ రోడ్స్, ఎస్బీహెచ్ క్రాస్ రోడ్స్, ప్లాజా, సీటీఓ జంక్షన్, బ్రూక్ బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, స్వీకార్ ఉపకార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, త్రిముల్గెర్రీ క్రాస్ రోడ్స్, తాడ్బండ్ క్రాస్ రోడ్స్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోవెన్ పల్లి క్రాస్ రోడ్స్, రసూల్ పురా జంక్షన్, బేగంపేట, పారడైజ్ జంక్షన్ లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది.

రైళ్లు, బస్సులలో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు ముందుగానే బయలుదేరి పికెట్‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్)కి సకాలంలో చేరుకోవాలని తెలిపారు. జాప్యాన్ని నివారించడానికి మెట్రో రైలు సేవను ఉపయోగించుకోవాలని కూడా సూచించారు.

Next Story