హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic restrictions in Hyderabad today .. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచా

By సుభాష్  Published on  28 Nov 2020 9:50 AM IST
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 5 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. అయితే కేసీఆర్‌ సభకు భారీ ఎత్తున జనాలను తరలించాలని నేతులు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కంట్రోల్‌ రూమ్‌ మీదుగా వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించారు. అబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలు ఎస్‌బీఐ,చాపెల్‌ రహదారి వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అలాగే బహీర్‌బాగ్‌, అబిడ్స్‌ నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, కోఠి వైపు, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్‌ వైపు మళ్లించనున్నారు. సభ కోసం భారీ ఎల్‌ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. స్టేడియంలో మూడు వేదికలు ఏర్పాటు చేస్తారు. మొదటి వేదిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. ఇక రెండో వేదిక కళాకారుల కోసం ఏర్పాటు చేయగా, మూడో వేదిక నగరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులుంటారు. అంతేకాకుండా వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. స్టేడియంప్రతి గేటు వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు నేతలు వెల్లడించారు.

Next Story