ఈరోజు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సోమవారం నాడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
By అంజి Published on 9 Dec 2024 9:37 AM ISTఈరోజు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సోమవారం నాడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వయిజరీ జారీ చేశారు.
బుద్ధభవన్, అంబేద్కర్ విగ్రహం, ఖైరతాబాద్ బడా గణేష్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పీవీఎన్‌ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు అనుమతించరు. తెలుగుతల్లి విగ్రహం, రవీంద్ర భారతి నుంచి ఓల్డ్ పీఎస్ సైఫాబాద్ వైపు ట్రాఫిక్ అనుమతించరు. ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి నుండి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్ మళ్లిస్తారు. బుద్ధభవన్, నల్లగుట్ట చౌరస్తా, వివి విగ్రహం (ఖైరతాబాద్) జంక్షన్, ఇక్బాల్ మినార్, కొత్త తెలుగు తల్లి జంక్షన్, ప్రింటింగ్ ప్రెస్ జెఎన్, ఓల్డ్ పిఎస్ సైఫాబాద్, రవీంద్ర భారతి, కట్టమైసమ్మ జంక్షన్, పాత అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ జంక్షన్‌లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు. దీన్ని బట్టి మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.