అలర్ట్‌.. హైద‌రాబాద్ న‌గ‌రంలో నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions in Hyderabad Today.హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌. న‌గ‌రంలో నేడు(ఆదివారం) ప్ర‌ముఖుల ప‌ర్య‌ట‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2022 5:31 AM GMT
అలర్ట్‌.. హైద‌రాబాద్ న‌గ‌రంలో నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌. న‌గ‌రంలో నేడు(ఆదివారం) ప్ర‌ముఖుల ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. ప‌రేడ్ గ్రౌండ్‌లో బీజేపీ త‌ల‌పెట్టిన బ‌హిరంగ స‌భ కోసం పోలీసులు భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ప‌టిష్ఠ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. పోలీసులు సూచించిన దారిలోనే వాహ‌న‌దారులు ప్ర‌యాణించాల‌న్నారు.

హెచ్ఐసీసీ మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌, రాజ్ భవన్, పంజాగుట్ట, బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌, ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎన్డీ రోడ్, పరేడ్ గ్రౌండ్ తదితర ప్రాంతాల వైపు వాహనదారులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సీపీ ఆనంద్ కోరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయ‌ని తెలిపారు. టివోలి X రోడ్ నుంచి ప్లాజా X రోడ్ మధ్య రహదారిని పూర్తిగా మూసివేయనున్నారు. MG రోడ్, RP రోడ్, SD రోడ్లలో, సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని జంక్షన్లు, రోడ్లలో ప్రయాణాలపై ఆంక్షలు విధించనున్నారు.

- పంజాగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్, ఆర్‌టీసీ X రోడ్, మీదుగా చిలకలగూడ నుంచి ఫ్లాట్ ఫారం నంబర్ 10 ద్వారా దారిని మ‌ళ్లింపు

- ఉప్పల్ వైపు నుంచి నారాయణగూడ, ఆర్‌టీసీ X రోడ్, మీదుగా చిలకలగూడ నుంచి ప్లేట్ ఫారం నంబర్ 10 నుంచి మ‌ళ్లింపు

-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి ప్యాటినీ, పారడైస్, బేగంపేట్ దారులలో ఆంక్షలు

- ఉప్పల్ వైపు నుంచి పంజాగుట్ట/అమీర్‌పేట్‌ వెళ్లే ప్రయాణికులు తార్నాక, రైలు నిలయం రోడ్‌ను నివారించి ఆర్.ట్.సి. X రోడ్ నుంచి లక్డికాపూల్ మీదుగా వెళ్లాలి.

Next Story