ప్రయాణికులకు అలర్ట్‌.. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic restrictions in Hyderabad from 3 pm today. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నేడు వాహనాల రాకపోకలపై ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ నగర ట్రాఫిక్‌ పోలీసులు..

By అంజి  Published on  3 Oct 2022 11:26 AM IST
ప్రయాణికులకు అలర్ట్‌.. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నేడు వాహనాల రాకపోకలపై ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ నగర ట్రాఫిక్‌ పోలీసులు.. ట్రాఫిక్‌ అడ్వయిజరీ జారీ చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకోవాలని వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు సూచించాఉ. నేడు నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఎల్‌బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్ సమీపంలోని పలు రహదారులపై సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆంక్షలు ఉంటాయి. సద్దులబతుకమ్మతెలంగాణలోని ప్రజలు, ముఖ్యంగా మహిళలు జరుపుకునే పూల పండుగ. వేడుకల కోసం ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో కన్నుల పండువగా వేడుకలు జరగనున్నాయి.

బషీర్‌బాగ్‌, పీసీఆర్‌ జంక్షన్‌, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్‌, నాంపల్లి, అబిడ్స్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల, అంబేద్కర్‌ విగ్రహం, కవాడిగూడ, కట్టమైసమ్మ ఆలయం, కర్బాలమైదాన్‌, బైబిల్‌ హౌస్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట జంక్షన్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని చెప్పారు. బతుకమ్మ వేడుకల కోసం ఎల్బీ స్టేడియానికి వచ్చే వారి వాహనాల కోసం సర్కార్‌ ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసింది. వీఐపీలు, అధికారుల కోసం టెన్నిస్ మైదానంలో పార్కింగ్ ఏర్పాట్లు చేసిన అధికారులు తెలిపారు. మీడియా వాహనాలకు ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయం వద్ద పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. నిజాం కాలేజ్‌ మైదానంలోనూ పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.

చాపెల్ రోడ్, నాంపల్లి నుండి వచ్చే వాహనాలు.. బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్లడానికి అనుమతించబడదు. ఏఆర్‌ పెట్రోల్ పంపు వద్ద పీసీఆర్‌ వైపు మళ్లించబడుతుంది. ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వైపు నుండి వచ్చే వాహనాలు.. ప్రెస్ క్లబ్/బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వెళ్లడానికి అనుమతించబడదు. ఎస్బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లించబడుతుంది. రవీంద్ర భారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుండి వచ్చే వాహనాలు.. బిజెఆర్ విగ్రహం వైపు వెళ్లడానికి అనుమతించబడదు, ఫతే మైదాన్‌లోని కెఎల్‌కె బిల్డింగ్‌లోని సుజాత హైస్కూల్ వైపు మళ్లించబడుతుంది.

Next Story