హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్.. నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions in Hyderabad city Today.హైద‌రాబాద్ న‌గ‌రంలో నేడు ప‌లు చోట్ల ట్రాపిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2022 3:15 AM GMT
హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్.. నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్ న‌గ‌రంలో నేడు ప‌లు చోట్ల ట్రాపిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. మొహర్రం సందర్భంగా బీబీకా అలావా నుంచి చాదర్‌ఘాట్‌ వరకు యాత్ర సాగనున్నది.


ఊరేగింపు బీబీ కా ఆలం-షేక్ ఫైజ్ క‌మాన్‌, యాకుత్ పురా రోడ్‌, ఎతేబార్ చౌక్‌-అలీజా కోట్లా- చార్మినార్‌-గుల్జార్ హౌజ్‌, పంజేషా,మీర్ చౌక్ పోలీస్ స్టేష‌న్‌- మీర్ ఆలం నుండి -దారుల్షిషా మైదానం- అజ‌ఖానా-ఎ-జోహ్రా, కాలీ ఖ‌బ‌ర్ కొన‌సాగి మ‌స్జిద్‌-ఇ-ఇలాహి చాద‌ర్‌ఘాట్‌ద‌గ్గర ముగుస్తుంది. ఊరేగింపు మార్గంలో వాహ‌నాల‌ను అనుమ‌తించ‌బోమ‌ని, ప్ర‌జ‌లు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని ట్రాఫిక్ పోలీసులు కోరారు. కాబ‌ట్టి వాహ‌న దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు. జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు అఫ్జల్‌గంజ్‌ వైపు మళ్లించనున్నారు.

Next Story