Hyderabad: ట్రాఫిక్‌ ఆంక్షలు.. గచ్చిబౌలి - కొండాపూర్ రోడ్డు 3 నెలలు పాటు మూసివేత

గచ్చిబౌలి జంక్షన్ నుంచి సైబరాబాద్ కొండాపూర్ రోడ్డు వైపు ఫ్లైఓవర్ పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపులను పోలీసులు ప్రకటించారు.

By అంజి  Published on  11 May 2023 4:45 AM GMT
Traffic restrictions,Hyderabad,Gachibowli,Kondapur road, GHMC

Hyderabad: ట్రాఫిక్‌ ఆంక్షలు.. గచ్చిబౌలి - కొండాపూర్ రోడ్డు 3 నెలలు పాటు మూసివేత

హైదరాబాద్: గచ్చిబౌలి జంక్షన్ నుంచి సైబరాబాద్ కొండాపూర్ రోడ్డు వైపు ఫ్లైఓవర్ పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపులను పోలీసులు ప్రకటించారు. మళ్లింపులు మే 13 నుంచి ఆగస్టు 10 వరకు అమల్లో ఉంటాయి. గచ్చిబౌలి జంక్షన్‌లో శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లై ఓవర్ పనులను జీహెచ్‌ఎంసీ 24 గంటలూ చేపడుతోంది. ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని సూచించారు.

మళ్లింపు దారులు ఇక్కడ ఉన్నాయి

- ఔటర్ రింగ్ నుంచి హఫీజ్‌పేట వైపు వచ్చే ట్రాఫిక్.. శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా మీనాక్షి డెలాయిట్‌, రాడిసన్ హోటల్, బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లవచ్చు.

- లింగంపల్లి నుంచి కొండాపూర్ వైపు వచ్చే వాహనాలు గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్, డీఎల్ఎఫ్, రాడిసన్ హోటల్ నుంచి వెళ్లొచ్చు.

- విప్రో జంక్షన్ నుంచి అల్విన్ కాలనీ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్ గచ్చిబౌలి స్టేడియం వద్ద యూటర్న్ తీసుకొని డీఎల్ఎఫ్ మీదుగా వెళ్లాలి.

- టోలిచౌకీ నుంచి ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్డుకు వెళ్లే ట్రాఫిక్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి మైండ్‌స్పేస్ అండర్ పాస్, సైబర్ టవర్, శిల్పారామం మీదుగా వెళ్లాలి.

- టెలికాంనగర్ నుంచి కొండాపూర్ వైపు వెళ్లాల్సిన వాహనాలు గచ్చిబౌలి ప్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని శిల్పా లే అవుట్ ప్లై ఓవర్ ర్యాంప్ పై నుంచి డెలాయిట్ రోడ్డులో వెళ్లాలి.

- అల్విన్ కాలనీ క్రాస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లాల్సిన వాహనాలను బొటానికల్ గార్డెన్ వద్ద మసీద్ బండ వైపు మళ్లిస్తారు. అవసరమైన చోట సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.

పనులు సజావుగా జరిగేందుకు వర్క్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ, ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.

Next Story