హైదరాబాద్: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం నాడు.. మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించడానికి వీకెండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో 272 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు కేసులు నమోదు చేశారు. నేరస్థులలో 189 మంది ద్విచక్ర వాహనదారులు, 12 మంది త్రీ వీలర్ డ్రైవర్లు, 66 మంది నాలుగు చక్రాల వాహన డ్రైవర్లు, ఐదుగురు భారీ వాహన ఆపరేటర్లు ఉన్నారు. మియాపూర్‌లో అత్యధికంగా 50 కేసులు నమోదయ్యాయి. శంషాబాద్‌లో రెండవ స్థానంలో 43 ఉల్లంఘనలు నమోదయ్యాయి. షాద్‌నగర్ 32, చేవెళ్లలో 32 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు రాయదుర్గం, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఆర్‌సీ పురంలో ఎలాంటి కేసులు నమోదు కాకపోగా.. మాదాపూర్‌లో ఒక్క కేసు మాత్రమే నమోదైంది. కేసు నమోదైన నేరస్థులందరూ కోర్టు చర్యలను ఎదుర్కొంటారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైన వారిపై భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 105 కింద అభియోగాలు మోపనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది.