చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌.. నిజం కాదు.. ట్రాఫిక్ పోలీసుల క్లారిటీ

Traffic police gives clarity on 50 Percent Discount.ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే జ‌రిమానా త‌ప్ప‌దు. అయితే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sep 2021 5:54 AM GMT
చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌.. నిజం కాదు.. ట్రాఫిక్ పోలీసుల క్లారిటీ

ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే జ‌రిమానా త‌ప్ప‌దు. అయితే.. చ‌లానాల‌ను చెల్లించ‌డంలో కొంద‌రు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరిస్తున్నారు. ఒక్కొసారి ట్రాఫిక్ పోలీసులు వాహానాన్ని ఆపి చ‌లాన్ల‌ను ప‌రిశీలిస్తుంటే.. వేల రూపాయ‌లు చెల్లించాల్సిన ఘ‌ట‌న‌లు మ‌నం చూశాం. ఇదిలా ఉంటే.. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా చ‌లాన్ల‌పై 50 శాతం రాయితీ అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మీ వాహ‌నంపై ఉన్న చ‌లానా మొత్తంలో కేవ‌లం 50 శాతం చెల్లిస్తే చాలు.. అక్టోబర్ 4 నుంచి 7వ వ‌రకు హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ద్వారా ఈ సౌక‌ర్యాన్ని ఉప‌యోగించుకోవాల‌ని ఓ న్యూస్ వైర‌ల్‌గా మారింది.

దీనిపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఇది ఫేక్ న్యూస్ అని చెప్పారు. ఇలాంటి వార్త‌లు న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. 'అక్టోబర్ 4 నుంచి 7 వరకు లోక్ అదాల‌త్‌ ఉంటుందన్న ఎస్‌ఎంస్‌ వైరల్ అవుతున్నట్లు మేం గమనించామని. అది నకిలీ సందేశం.. ఎవ్వరూ నమ్మవద్దని' ట్వీట్ చేశారు. ఆ ఫేక్ న్యూస్ ను ప్ర‌చారం చేసినా.. లేక ఫార్మార్డ్ చేసినా వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ట్రాఫిక్ పోలీసులు హెచ్చ‌రించారు.

Next Story