హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. మూడు నెల‌ల పాటు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic curbs for three months at Rasoolpura-Ramgopalpet stretch.ర‌సూల్‌పురా-రాంగోపాల్‌పేట మ‌ధ్య నాలా పునరుద్ద‌ర‌ణ ప‌నుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Nov 2022 10:01 AM IST
హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. మూడు నెల‌ల పాటు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్ న‌గ‌రంలో వ్యూహాత్మ‌క నాలా అభివృద్ధి కార్యక్ర‌మం(ఎస్ఎన్‌డీపీ) కింద బేగంపేట ప‌రిధిలోని ర‌సూల్‌పురా-రాంగోపాల్‌పేట మ‌ధ్య నాలా పునరుద్ద‌ర‌ణ ప‌నుల నేప‌థ్యంలో నేటి(బుధ‌వారం న‌వంబ‌ర్ 23) నుంచి మూడు నెల‌ల పాటు ట్రాఫిక్‌ను మ‌ళ్లిస్తున్నారు. నేటి నుంచి 21 ఫిబ్ర‌వ‌రి 2023 వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ తెలిపారు. కాబ‌ట్టి వాహ‌న‌దారులు ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని సూచించారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా..

- బేగంపేట ఫ్లైఓవర్‌ నుంచి కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట, వీపీఎన్‌ఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లేందుకు రసూల్‌పురా టీ-జంక్షన్‌ వద్ద యూటర్న్‌ తీసుకునేందుకు అనుమతి లేదు. కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట వైపు రసూల్‌పుర నుంచి వెళ్లే వాహనాలు సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్ తీసుకోవాలి. హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఫుడ్‌వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా, కిమ్స్‌ ఆసుపత్రుల వైపు వెళ్లొచ్చు.

- రాణిగంజ్‌, నల్లగుట్ట, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పుర వైపు అనుమతించ‌బ‌డ‌వు. ఆ వైపు వచ్చే వాహనాలు రాంగోపాల్‌పేట ఠాణా, సింధికాలనీ, ఫుడ్‌వరల్డ్‌, హనుమాన్‌ టెంపుల్‌ మీదుగా వచ్చి ఎడమవైపు తీసుకుని రసూల్‌పుర వైపు వెళ్లాలి.


- సికింద్రాబాద్‌ వైపు నుంచి కిమ్స్‌ ఆసుపత్రి వైపు వచ్చే వాహనాలు హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఎడమకు తీసుకుని, ఫుడ్‌ వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా మీదుగా ఎడమకు మళ్లి కిమ్స్‌ ఆస్పత్రి వైపు వెళ్లవచ్చు. లేదంటే.. సీటీఓ ఫ్లైఓవర్‌ నుంచి ఎడమకు తీసుకుని రాణిగంజ్‌ మీదుగా వచ్చి కుడి వైపుగా కిమ్స్‌కు చేరుకోవచ్చు.

- అంబులెన్స్‌లు లేదా రోగులను బేగంపేట ఫ్లైఓవర్‌ వైపు నుంచి కిమ్స్‌కు తీసుకువెళ్లాలంటే సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకుని రాంగోపాల్‌పేట ఠాణా నుంచి కిమ్స్‌ వైపు వెళ్లే ఛాన్సుంది. ఇక భారీ వాహనాలు మినిస్టర్‌ రోడ్‌ వైపు వెళ్లాలంటే మాత్రం రాణిగంజ్‌ మార్గంలో రాకపోకలు సాగించాలి.

Next Story