గోల్కొండ కోటలో పంద్రాగ‌స్టు వేడుకలు.. రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Traffic curbs for Independence Day fete at Golkonda.ఆదివారం గోల్కొండ కోట‌లో పంద్రాగ‌స్టు వేడుక‌లు జ‌రుగ‌నున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2021 3:53 AM GMT
గోల్కొండ కోటలో పంద్రాగ‌స్టు వేడుకలు.. రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

ఆదివారం గోల్కొండ కోట‌లో పంద్రాగ‌స్టు వేడుక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఇక గోల్కొండ కోట‌లో ప్ర‌తి అణువూ రికార్డు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నగర పోలీసులు వీటినీ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో (సీసీసీ) అనుసంధానించింది. స్థానిక పోలీసుస్టేషన్, కోట వద్ద ఉన్న కంట్రోల్‌ రూమ్‌లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..

- ఆగ‌స్టు 15న ఉ.7 నుంచి మ.12 గంటల వరకు కోట వైపునకు వాహనాలకు అనుమతి లేదు.

- రాందేవ్‌గూడ నుంచి కోటకు ఎ, బి, సి, పాస్‌ హోల్డర్స్‌ వాహనాలకే అనుమతి

- సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం నుంచి వచ్చే పాస్‌ హోల్డర్లు రేతిబౌలి,నానల్‌నగర్‌ జంక్షన్‌ నుంచి లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్‌ బ్రిడ్జి, రాందేవ్‌గూడ జంక్షన్‌ మీదుగా రావాలి

- మక్కై దర్వాజ వద్ద ఎ– కారు పాస్‌ హోల్డర్లు మెయిన్‌ రోడ్డు పక్కన, బి– పాస్‌ హోల్డర్లు గోల్కొండ కోట బస్టాప్‌ వద్ద, సి– కారు పాస్‌ హోల్డర్లు గోల్కొండ బాయ్స్‌ గ్రౌండ్‌ ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో పార్క్‌ చేయాలి. డి– పాస్‌ హోల్డర్లు ప్రియదర్శిని స్కూల్‌ వద్ద వాహనాలను పార్క్‌ చేయాలి. ఇ– కారు పాస్‌ హోల్డర్లు సెవన్‌ టూంబ్స్‌ బంజారా దర్వాజ మీదుగా రేతిగల్లిలోని ఒౖవైసి గ్రౌండ్‌లో వాహనాలను పార్క్‌ చేయాలి.

- లంగర్‌హౌస్‌ మీదుగా వచ్చే ఇ– పాస్‌ హోల్డర్లు బడాబజార్, బల్దియా ఐలాండ్‌ మీదుగా ఒవైసి గ్రౌండ్‌కు వెళ్లాలి. ఎఫ్‌– కారు పార్క్‌ హోల్డర్లు లంగర్‌హౌస్‌ మీదుగా ఫతే దర్వాజ నుంచి హుడా పార్కు వద్ద వాహనాలను పార్క్‌ చేయాలి.

- షేక్‌పేట్, టోలిచౌకికి చెందిన వారు బంజారా దర్వాజ నుంచి ఆర్టీసి బస్సుల ద్వారా కోటకు చేరుకోవాలి.

- వేడుకలు పూర్తయిన తర్వాత ఏ,బీ,సీ– కారు పాస్‌ హోల్డర్లు మక్కై దర్వాజ, రాందేవ్‌గూడ, లంగర్‌హౌస్‌ నుంచి వెళ్లాలి. డి కారు పాస్‌ హోల్డర్లు బంజారదర్వాజ మీదుగా సెవన్‌ టూంబ్స్‌ వైపు వెళ్లాలి. ఇ– కారు పాస్‌ హోల్డరు బడాబజార్, ఫతే దర్వాజ గుండా వెళ్లాలి. ఎఫ్‌– కారు పాస్‌ హోల్డర్లు తమ తమ పార్కింగ్‌ ప్రదేశాల నుంచి వచ్చిన మార్గం గుండానే వెనక్కి వెళ్లిపోవాలి. అన్ని రకాల పాస్‌ హోల్డర్లు తమ పాస్‌ను తమ కారుపై డిస్‌ప్లే చేయాలి.

Next Story