బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం నేడే.. ట్రాఫిక్ ఆంక్షలు
Today Balkampet Yellamma Kalyana Mahotsavam.బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం నేడు(మంగళవారం) జరగనుంది.
By తోట వంశీ కుమార్ Published on 5 July 2022 9:29 AM ISTబల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం నేడు(మంగళవారం) జరగనుంది. ఇందుకోసం అధికారులు, దేవాలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నేడు అమ్మవారి కల్యాణోత్సవం జరగనుండగా రేపు రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీంతో నేడు, రేపు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అందుకనే వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకుని ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
- గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుండి ఫతే నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ వద్ద, ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాషా టవర్స్, బీకేగూడ క్రాస్ రోడ్,శ్రీరామ్ నగర్ క్రాస్‌రోడ్స్, సనత్ నగర్ నుంచి ఫతే నగర్ రోడ్డు వైపు మళ్లింపు.
- ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదు. బల్కంపేట-బేగంపేట లింకు రోడ్డులోకి మళ్లించి కట్టమైసమ్మ టెంపుల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. గ్రీన్‌ల్యాండ్స్ – బకుల్ అపార్ట్‌మెంట్లు – ఫుడ్ వరల్డ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌కు బల్కంపేట్ వైపు అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
- ఫుడ్ వరల్డ్ క్రాస్‌రోడ్‌లో సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రీవనం నుంచి ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ వైపు మళ్లింపు.
- బేగంపేట, కట్టమైసమ్మ దేవాలయం నుంచి బల్కంపేట్ వైపు వచ్చే వాహనదారులకు అనుమతి ఉండదని, గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్, ఎస్‌ఆర్ నగర్ టీ జంక్షన్ ఎడమ మలుపులో ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాల్ వైపు మళ్లించనున్నారు.
- ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు అన్ని సబ్ లైన్లు, లింక్‌రోడ్లను మూసివేయడం జరుగుతుందని,వాహనదారులు గమనించి ట్రాఫిక్ సిబ్బందికి సహకరిచాలని కోరారు.
పార్కింగ్ ఏరియాలు..
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం చూసేందుకు వచ్చే భక్తల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆర్ అండ్ బీ కార్యాలయం, అమీర్‌పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్, నేచర్ క్యూర్ హస్పిటల్ రోడ్డు వైపు పార్కింగ్‌ను చేసుకోవచ్చు.