హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. రైలు కింద పడి ఒకే కుటుంబానికి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నగర పరిధిలోని చర్లపల్లి - ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఎంఎంటీఎస్ డౌన్‌లైన్‌లో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విశాల్, పిన్నింటి విజయ, పిన్నింటి చేతనగా గుర్తించారు.
గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారం మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుల వద్ద రైల్వే టికెట్లు, విలువైన వస్తువులు లేవని జీఆర్‌పీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు జీఆర్‌పీ క్రైమ్ నంబర్ 57/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.