హైదరాబాద్‌లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఓ ఇంట్లో విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

By అంజి  Published on  13 April 2023 9:45 AM IST
Hyderabad, Tolichowki

హైదరాబాద్‌లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి 

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఓ ఇంట్లో విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన టోలిచౌకీ ప్రాంతంలో జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పారామౌంట్‌ కాలనీలోని సయ్యద్‌ అనీసుద్దీన్‌(17) తమ ఇంట్లో ఉన్న విద్యుత్‌ నీటి పంపు స్విచ్‌ ఆన్‌ చేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు.

ఇది గమనించిన అతని ఇద్దరు బంధువులు రజాక్ (18), రిజ్వాన్ (17) అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు, అయితే వారిద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇంట్లో అలజడి వినిపించిన ఇరుగుపొరుగు వారు వచ్చి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story