హైదరాబాద్: కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఇంట్లో ఒకరు మృతి చెందారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను తులసీరాం (47), బోజ్జయ్య (55), నారాయణమ్మ (65) గా గుర్తించారు. మృతులు హెచ్‌ఎంటీ హిల్స్‌లోని సాయి చరణ్ కాలనీకి చెందినవారు.
తాజాగా కల్తీ కల్లు ఘటనలో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. కల్తీ కల్లు తాగి 19 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. నిమ్స్‌లో 15 మంది, గాంధీలో ఇద్దరు, మరో ఇద్దరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందనీ.. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించి వైద్య అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపైఎక్సైజ్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
అటు ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్‌పల్లిలోని మూడు కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు. హైదరానగర్, షంషిగూడ, కెపిహెచ్‌బి కాలనీలలోని మూడు కల్లు దుకాణాలను నిషేధ, ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. ఈ దుకాణాలలో అమ్ముతున్న కల్లులో అల్ప్రజోలం, డయాజెపామ్ వంటి మత్తుమందులు కలిపి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.