విషాదం..నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మూడు మృతదేహాల వెలికితీత

హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది

By -  Knakam Karthik
Published on : 25 Jan 2026 10:53 AM IST

Hyderabad News,  Nampally fire incident, Building fire, Rescue operation, Three bodies recovered

విషాదం..నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మూడు మృతదేహాల వెలికితీత

హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దాదాపు 20 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో మూడు మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. భవనంలోని సెల్లార్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గోడలకు రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించిన రెస్క్యూ బృందాలు, ముగ్గురి మృతదేహాలను గుర్తించాయి. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

సెల్లార్ మొత్తం ఫర్నీచర్‌తో నిండి ఉండటం, దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Next Story