Hyderabad : ప్రేమించక పోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ వేస్తానంటూ బెదిరింపులు

ప్రేమిస్తున్నానంటూ వెంటపడే ఎంతో మంది ఉంటారు. కొందరు నాకు ఇష్టం లేదు అంటే తప్పుకుంటారు

By Medi Samrat  Published on  16 Nov 2024 2:33 PM IST
Hyderabad : ప్రేమించక పోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ వేస్తానంటూ బెదిరింపులు

ప్రేమిస్తున్నానంటూ వెంటపడే ఎంతో మంది ఉంటారు. కొందరు నాకు ఇష్టం లేదు అంటే తప్పుకుంటారు. మరికొందరేమో ఏదేదో చేస్తానంటూ బెదిరిస్తారు. అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బాధితులు మొదట కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడం చాలా మంచిది. ఇక ప్రేమోన్మాదుల సంఖ్య కూడా దేశంలో భారీగా పెరిగిపోతూ ఉంది. అమ్మాయిలను బయట తిరగనివ్వకుండా వేధిస్తూ ఉండడమే వీరి పని అయిపోయింది. చంపేస్తానంటూ బెదిరించడం, అది చేస్తాను.. ఇది చేస్తాను అంటూ హెచ్చరిస్తూ ప్రశాంతత లేకుండా చేస్తున్నారు.

తాజాగా ఓ వ్యక్తి ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ వేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అంతేకాదు మీ అమ్మ, నాన్నను కూడా చంపేస్తా అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ హయత్ నగర్ లో యువతిపై లైంగిక వేధింపులకు దిగాడు విజయ్ అనే వ్యక్తి. గతంలో బాధితురాలితో విజయ్ స్నేహం చేశాడు. కానీ అతడి బుద్ధి సరిగా లేదని యువతి అతడిని దూరంగా పెట్టింది. ఇది నచ్చని విజయ్ యువతిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. అతడు చెప్పింది చేయకపోవడంతో ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విజయ్ చేతిలో మరో ముగ్గురు యువతులు కూడా మోసపోయారని బాధితురాలు చెబుతోంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Next Story