Hyderabad: ఈ హోటళ్లు, రెస్టారెంట్‌లలో ఫుడ్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
మే 21, 2024న, కమీషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ నేతృత్వంలోని FSSAI టాస్క్ ఫోర్స్ బృందం, హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని అనేక ఫుడ్ అవుట్ లెట్లలో తనిఖీలను నిర్వహించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 May 2024 9:30 PM ISTHyderabad: ఈ హోటళ్లు, రెస్టారెంట్‌లలో ఫుడ్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
మే 21, 2024న, కమీషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ నేతృత్వంలోని FSSAI టాస్క్ ఫోర్స్ బృందం, హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని అనేక ఫుడ్ అవుట్ లెట్లలో తనిఖీలను నిర్వహించింది.
ఆహార భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోడానికి ఈ సోదాలు నిర్వహించారు. కృతుంగ - ది పాలెగార్స్ రెస్టారెంట్, హెడ్ క్వార్టర్స్ రెస్ట్-ఓ-బార్, KFCలో ఉల్లంఘనలు జరిగినట్లు కనుగొన్నారు. అసురక్షిత ఆహార పదార్థాలను ఉపయోగిస్తూ ఉన్నారని, పరిశుభ్రత, భద్రతా లోపాలను గుర్తించారు.
కృతుంగ రెస్టారెంట్
లైసెన్స్ లేని పనీర్: 6 కిలోల గంగా గోల్డ్ పనీర్, విలువ రూ. 2,100.. FSSAI లైసెన్స్ లేదు. లోగో లేదా తేదీలు లేకుండా సీల్డ్ ప్యాకెట్‌లలో ఉంచారు. వీటిని అక్కడికక్కడే వదిలేశారు.
గడువు ముగిసిన ఉత్పత్తులు: 6 కిలోల మేతి మలై పేస్ట్, రూ. 1,800 విలువైనది కనుగొన్నారు. 3 ఏప్రిల్ 2024న గడువు ముగిసినట్లు కనుగొన్నారు.
నీటి నాణ్యత: 156 యూనిట్ల 1-లీటర్ వాటర్ బాటిళ్ల కృతుంగ పాలెగార్ బ్రాండ్ రూ. 7,800.. కేవలం 4ppm TDS విలువ కారణంగా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విశ్లేషణ కోసం నమూనాలను ప్రయోగశాలకు పంపారు.
లేబులింగ్ విషయంలో అవకతవకలు: నాన్ వెజ్ పేస్ట్ విలువ రూ. 648, సిట్రిక్ యాసిడ్ ప్యాకెట్ రూ. 150 సరైన లేబులింగ్ లేకుండా ఉంచారని తెలుస్తోంది.
స్టోరేజ్ కు సంబంధించి అవకతవకలు: ముడి ఆహార పదార్థాలు సరైన లేబులింగ్ లేదా కవర్ లేకుండా రిఫ్రిజిరేటర్ లోపల నిల్వ చేశారు.
పరిశుభ్రత ఉల్లంఘనలు: కీటకాల ప్రవేశాన్ని నిరోధించడానికి తగిన అడ్డంకులు లేకుండా వంటగది ప్రాంగణం తెరచి ఉంచారు. డస్ట్‌బిన్ల మూతలు కూడా తెరిచి ఉన్నాయి.
భద్రత, ఆరోగ్య పర్యవేక్షణలు: హెయిర్‌క్యాప్‌లు, గ్లోవ్‌లు, అప్రాన్‌లు లేకుండా ఫుడ్ హ్యాండ్లర్లను గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో లేవు. RO నీటికి సంబంధించి నీటి విశ్లేషణ నివేదిక లేదు.
హెడ్ క్వార్టర్స్ రెస్ట్-ఓ-బార్:
హెడ్ క్వార్టర్స్ రెస్ట్-ఓ-బార్ వద్ద, టాస్క్ ఫోర్స్ బృందం అనేక సమస్యలను గుర్తించింది.
లేబుల్ లేని ఉత్పత్తులు: 50 పిజ్జా బేస్‌లు, గార్లిక్ బ్రెడ్ ప్యాకెట్లు, 5 కిలోల నూడుల్స్ ను కనుగొన్నారు. సీల్డ్ ప్యాక్‌లపై లేబుల్స్ లేవని గుర్తించారు.
సరికాని లేబులింగ్: నాన్ వెజ్ పేస్ట్ విలువ రూ. 648, సిట్రిక్ యాసిడ్ ప్యాకెట్ రూ. 150 సరైన లేబులింగ్ లేకుండా కనుగొన్నారు.
నిల్వ విషయంలో ఆందోళనలు: సగం-తయారు చేసిన, ముడి ఆహార పదార్థాలు సరైన లేబులింగ్ లేదా కవర్ లేకుండా రిఫ్రిజిరేటర్ లోపల నిల్వ చేశారు.
పరిశుభ్రత ఉల్లంఘనలు: కీటకాల ప్రవేశాన్ని నిరోధించడానికి తగిన అడ్డంకులు లేకుండా వంటగది ప్రాంగణం కనిపించింది. డస్ట్‌బిన్‌ల మూతలు లేకుండా తెరిచి ఉంచారు.
ఆందోళనలు: ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు.
ఆహార నిల్వల్లో సమస్యలు: శాఖాహారం, మాంసాహార ఆహార పదార్థాలు రిఫ్రిజిరేటర్‌లో ఒకే చోట నిల్వ చేశారు.
నిషేధించబడిన పదార్థాలు: సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను ఉపయోగించడం గమనించారు.
KFC సోమాజిగూడ:
KFC వద్ద, FSSAI లైసెన్స్ నిజమైన కాపీని ప్రాంగణంలో ఏ ప్రముఖ ప్రదేశంలో ప్రదర్శించలేదు.
పెనాల్టీ
తెలంగాణ ప్రభుత్వ ఆహార భద్రత కమిషనర్ తనిఖీలు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి ఆహార భద్రతా నిబంధనలను పాటించే ప్రాముఖ్యతను నొక్కి మరీ చెప్పారు.
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జారీ చేసిన ఆహార భద్రతా నిబంధనలు, ఆదేశాలను పాటించడంలో విఫలమైతే, ఏదైనా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్‌కు ₹2 లక్షల జరిమానా విధిస్తారు.