హైదరాబాద్: గవర్నర్ కార్యాలయమైన తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ కలకలం రేపింది. తెలంగాణ రాజ్‌భవన్‌లో పలు హార్డ్ డిస్క్‌లు మాయం అయ్యాయి. రాజ్ భవన్‌లోని సుధర్మ భవన్‌లో నాలుగు హార్డ్ డిస్క్‌లు మాయమైనట్టు తెలుస్తోంది. ఈ హార్డ్ డిస్క్‌ల్లో కీలకమైన రిపోర్ట్‌లు, ఫైల్స్ ఉన్నట్టు సమాచారం. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా చోరీ జరిగినట్టు గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాలు పరిశీలించారు.
ఈ నెల 14వ తేదీ రాత్రి చోరీ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. 14వ తేదీన హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి ఈ చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి చోరీచేసిన హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్‌లను శ్రీనివాస్ ఎందుకు చోరీ చేశాడన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ప్రస్తుతం ఈ చోరీ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.