కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు రూ. 46 లక్షలు విలువ గల డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదని కేవీపీ సతీమణి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 11న సునీత డైమండ్ నెక్లెస్ ధరించి ఓ ఫంక్షన్‌ను వెళ్లారు. ఫంక్షన్ అనంతరం ఇంటికి వచ్చి నెక్లెస్ తీసి బెడ్‌రూమ్‌లో పెట్టారు. ఆ తరువాత చూస్తే నెక్లెస్ కనిపించలేదు. దీంతో ఇళ్లంతా వెతకకగా ఎక్కడ కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.