మా ఇంటి సమస్య మేమే పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు

పహాడీషరీఫ్ పోలీసులు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబు ఇంటికి.. వివరాలు, వాస్తవాలు తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు.

By Kalasani Durgapraveen  Published on  10 Dec 2024 6:14 AM GMT
మా ఇంటి సమస్య మేమే పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు

పహాడీషరీఫ్ పోలీసులు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబు ఇంటికి.. వివరాలు, వాస్తవాలు తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులకు మోహన్ బాబు షాక్ ఇచ్చారు. విచారణకు నో చెప్పారు. పోలీసులతో తమ ఇంటి సమస్య తామే పరిష్కరించుకుంటామన్నారు.

మంచు ఫ్యామిలీ రోడ్డెక్కింది. తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకు ముందు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఫిర్యాదుపై ఇప్పటికే 'ఎక్స్' వేదికగా మంచు మనోజ్ స్పందించారు.

ఆస్తికోసమే ఇలా చేస్తున్నాడని తనపై మోహన్ బాబు చేస్తున్న ఆరోపణలపై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మనోజ్ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని క్లారిటీ ఇచ్చారు. తాను, తన భార్య సొంత కాళ్ల మీద నిలబడుతున్నాం అని చెప్పారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నా అన్నారు. బాధితుల పక్షాన నిలబడ్డందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. విష్ణు, అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ ద్వారా దోపిడీకి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు గురవుతున్నారని అన్నారు. మనోజ్ దీనిపై ప్రశ్నిస్తే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఆరోపణలు చేస్తున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు.

Next Story