హైద‌రాబాద్ మెట్రో రైలు ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌.. వేళల్లో మార్పు

The Last Service of Hyderabad Metro will be at 11 pm.హైద‌రాబాద్ మెట్రో రైలులో ప్ర‌యాణించే ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2023 7:36 AM GMT
హైద‌రాబాద్ మెట్రో రైలు ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌.. వేళల్లో మార్పు

హైద‌రాబాద్ మెట్రో రైలులో ప్ర‌యాణించే ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌. మెట్రో రైలు వేళ‌లు మారాయి. నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్‌ (నుమాయుష్) ముగియ‌డంతో గురువారం నుంచి రైలు వేళ‌లు మారాయి. నుమాయిష్ ఉండ‌డంతో రాత్రి 12 గంట‌లకు చివ‌రి మెట్రో రైలు న‌డ‌ప‌గా ఇప్పుడు రాత్రి 11 గంట‌లకే చివ‌రి రైలు బ‌య‌లుదేర‌నుంది. ఎల్‌బీనగర్‌, మియాపూర్‌, నాగోల్‌, రాయదుర్గం, జేబీఎస్‌ నుంచి చివరి మెట్రో రైళ్లు బ‌య‌లుదేరుతాయి. 12 గంట‌ల వ‌ర‌కు గ‌మ్య‌స్థానాల‌కు చేరుకుంటాయి.

ఇదిలా ఉంటే.. ఎగ్జిబిషన్‌ సందర్భంగా ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో అందించిన సేవలకుగాను నుమాయిష్‌ ముగింపు రోజు కియోలిస్‌ స్టేషన్స్‌ డీజీఎం జైపాల్‌రెడ్డిని మంత్రి మహమూద్‌ అలీ అభినందించారు. జ్ఞాపికను బహూకరించారు.

నాంపల్లిలో నుమాయిష్ సందర్భంగా మెట్రో ట్రైన్ సేవలను మరో గంట పొడిగిస్తున్నట్లు గతంలో అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నుమాయిష్ పూర్తయ్యే వరకు అర్థరాత్రి 12 గంటల దాక మెట్రో రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దాపు 46 రోజుల పాటు మెట్రో రైళ్లు 12 గంటల దాక నడిచాయి. ఇక ఇప్పుడు ఎగ్జిబిషన్‌ పూర్తి కావడం తో పాత టైమింగ్సే అమ‌ల్లోకి వ‌చ్చాయి.

Next Story