HYD: రాజేంద్రనగర్‌లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కలకలం
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలో 12 ఏళ్లు బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది.
By అంజి Published on 13 July 2023 11:15 AM ISTHYD: రాజేంద్రనగర్‌లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కలకలం
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి (జూలై 12న) చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్ తిరిగి ఇంటికి రాలేదు. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. తెలిసిన వారందరినీ అడిగారు. బాలుడి ఆచూకీ లభించక పోవడంతో బాలుడి తల్లి రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించింది. బాలుడి కోసం పోలీసులు రాత్రంతా తీవ్రంగా గాలించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బాలుడీ ఆచూకీని కనిపెట్టేందుకు ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. సాయి చరణ్ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మిస్సింగ్‌పై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సాయి చరణ్ మిస్సింగ్ కావడంతో అతడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో మిస్ అయిన విద్యార్థి ఆచూకీ.. మహారాష్ట్రలోని పర్బాని జిల్లా పూర్ణ పట్టణంలో లభించింది. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో విద్యార్థి బన్నీ ఆచూకి తెలుసుకొని తల్లిదండ్రులకు అప్పగించినట్లు బాసర పోలీసులు తెలిపారు.