థాయ్‌లాండ్ విద్యార్థినిపై ప్రొఫెస‌ర్ అత్యాచార‌య‌త్నం.. హెచ్‌సీయూలో ఉద్రిక్త‌త‌

Tension grips uoh after hindi professor sexually harasses thai student protest rock campus.హెచ్‌సీయూలో దారుణం చోటు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2022 7:47 AM GMT
థాయ్‌లాండ్ విద్యార్థినిపై ప్రొఫెస‌ర్ అత్యాచార‌య‌త్నం.. హెచ్‌సీయూలో ఉద్రిక్త‌త‌

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ(హెచ్‌సీయూ)లో దారుణం చోటు చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెస‌ర్ అత్యాచారానికి య‌త్నించాడు. ఆమె ప్రతిఘ‌టించి త‌ప్పించుకుని పారిపోయింది. దీనిపై గ‌చ్చిబౌలి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. స‌ద‌రు ప్రొఫెస‌ర్‌పై పోలీసులు సెక్ష‌న్ 354 కింద కేసు న‌మోదుచేశారు. బాధితురాలి వాంగ్మూలం న‌మోదు చేసిన త‌రువాత మ‌రిన్ని సెక్ష‌న్లు న‌మోదు చేయ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై వ‌ర్సిటీలోని విద్యార్థులు భ‌గ్గుమ‌న్నారు. ప్రొపెస‌ర్‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ ధ‌ర్నాకు దిగారు. వ‌ర్సిటీ గేలు ఎదుట ప్రొఫెస‌ర్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డితే ఇంకెవ‌రికీ చెప్పాలంటూ ప‌లువురు విద్యార్థినులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. యాజ‌మాన్యం స్పందించి చ‌ర్య‌లు తీసుకునేంత వ‌ర‌కు ఆందోళ‌న విర‌మించేది లేద‌ని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పోలీసులు హెచ్‌సీయూలో అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.

Next Story