దేవుడిని ద‌ర్శించుకుందామ‌ని వెళితే.. భ‌క్తుడిపై పూజారి దాడి

Temple Priest attack a Devotee in Secunderabad Ganesh temple.ఎంతో మంది మాన‌సిక ప్ర‌శాంతత‌ కోసం గుడికెలుతుంటారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2022 1:27 PM GMT
దేవుడిని ద‌ర్శించుకుందామ‌ని వెళితే.. భ‌క్తుడిపై పూజారి దాడి

ఎంతో మంది మాన‌సిక ప్ర‌శాంతత‌ కోసం గుడికెలుతుంటారు. దేవుడిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆ ఆల‌యంలోని పూజారీ భ‌క్తుల‌కు ప్ర‌సాదాల‌ను అంద‌జేయ‌డం మ‌నం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే.. ఓ పూజారీ మాత్రం వీధి రౌడీలాగా దౌర్జ‌న్యం చేస్తూ భ‌క్తుడిపై దాడి చేశాడు. అంతేనా.. నీ ఇష్టం నువ్వు ఎవ‌రికీ చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించాడు. సికింద్రాబాద్ గ‌ణ‌ప‌తి ఆల‌యంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఉప్పల్‌లోని బాలాజీహిల్స్‌కి చెందిన ఓ భ‌క్తుడు గత ఆదివారం రోజున రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్‌లోని గ‌ణ‌ప‌తి ఆల‌యానికి వెళ్లాడు. వినాయ‌కుడిని ద‌ర్శించుకున్నాడు. అనంత‌రం ప‌క్క‌నే ఉన్న ఉప ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటున్న క్ర‌మంలో.. అనుమ‌తి లేకుండా గుడిలోకి ఎలా వెళ్తావంటూ పూజారి ప్ర‌భాక‌ర్ శ‌ర్మ భ‌క్తుడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్ర‌మంలో పూజారీ స‌ద‌రు భ‌క్తుడిపై దాడి చేశాడు. అంతేకాకుండా నువ్వు ఎవ‌రికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించాడు.

పూజారి చేసిన ప‌నితో దైవ ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఇత‌ర‌ భ‌క్తులు సైతం అవాక్క‌య్యారు. ఈ ఘ‌ట‌న మొత్తం ఆల‌యంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీనిపై భ‌క్తుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో పాటు ఆల‌య అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. దేవాదాయ‌శాఖ క‌మిష‌న‌ర్ దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకువెళ్లి.. పూజారీ ప్ర‌భాక‌ర్ శ‌ర్మ‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు.

భ‌క్తుడిపై పూజారీ దాడి చేసిన సీసీటీవీ పుటేజ్ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుత‌న్నారు. పూజలు చేసి.. భక్తులను ఆశీర్వదించాల్సిన పూజారే ఓ రౌడీ లాగా రెచ్చిపోయి భక్తుడి పై దాడి చేయడం ఏంట‌ని మండిప‌డుతున్నారు.

Next Story