సుదూర కలగా తెలంగాణ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్

Telangana Islamic Cultural Center gets no place in the budget. హైదరాబాద్‌: నగర శివార్లలో ఇస్లామిక్‌ కల్చరల్‌ సెంటర్‌ నిర్మాణానికి 10 ఎకరాల భూమిని

By అంజి  Published on  7 Feb 2023 4:22 PM IST
సుదూర కలగా తెలంగాణ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్

హైదరాబాద్‌: నగర శివార్లలో ఇస్లామిక్‌ కల్చరల్‌ సెంటర్‌ నిర్మాణానికి 10 ఎకరాల భూమిని అప్పగిస్తామని, రూ.40 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ శంకుస్థాపన జరగలేదు. ఇక 2023-24 బడ్జెట్‌లో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. అయితే బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి రూ.20 కోట్లు కేటాయిస్తూ 6 ఎకరాల భూమిని అప్పగిస్తున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు. 2017లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి భూమిని అప్పగిస్తున్నట్లు ప్రకటించగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ కేంద్రం నిర్మాణానికి రూ.40 కోట్లు కేటాయించారు.

కోకాపేటలో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు 2017లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అయితే ఇది ఇంకా సుదూర కలలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రభుత్వం చేసిన ప్రకటనలు కేవలం చెవికి ఆనందాన్ని కలిగి ఉన్నాయని అనిపిస్తోందని మైనార్టీలు అంటున్నారు. మరోవైపు శివలాల్‌ బంజారా భవన్‌, ఆదివాసీ భవన్‌ నిర్మాణాలు పూర్తి చేసి బంజారాహిల్స్‌లోని అత్యంత విలువైన స్థలంలో కోట్లాది రూపాయలతో రెండు భవనాలను నిర్మించారు. అయితే ప్రతిపాదిత ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో పురోగతి కనిపించడం లేదు.

Next Story