సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటి దగ్గర ఒక అనుమానిత బ్యాగు కలకలం రేపింది.

By Srikanth Gundamalla  Published on  15 Sept 2024 3:23 PM IST
సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటి దగ్గర ఒక అనుమానిత బ్యాగు కలకలం రేపింది. ఆ బ్యాగును గుర్తించిన సెక్యూరిటీ వింగ్ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. దాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అనుమానాస్పద బ్యాగును అక్కడిని నుంచి తరలించి తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బ్యాగు కలకలం తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు మరింత పటిష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వైపు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌ ఇంటి చుట్టూ పరిసరాలు అన్నీ పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటి దగ్గర లభ్యమైన బ్యాగులో ఏముందనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story