మ‌ల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ అగ్ని ప్రమాదం కేసు నిందితుడు అరెస్ట్

మ‌ల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్ కింద గత రెండు రోజుల క్రితం జరిగిన వాహనాల దగ్ధం కేసును ఛాద‌ర్ ఘాట్, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు.

By Kalasani Durgapraveen  Published on  8 Dec 2024 12:15 PM GMT
మ‌ల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ అగ్ని ప్రమాదం కేసు నిందితుడు అరెస్ట్

మ‌ల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్ కింద గత రెండు రోజుల క్రితం జరిగిన వాహనాల దగ్ధం కేసును ఛాద‌ర్ ఘాట్, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. గత రెండు రోజుల క్రితం మలక్ పేట్‌ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసి ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలు అగ్నిప్రమాదంలో ద‌గ్ధ‌మైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదు వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. కేసు నమోదు చేసిన ఛాద‌ర్ ఘాట్ పోలీసులు, సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మలక్ పేట ఏసీపీ శ్యామ్ సుందర్ అధ్వర్యంలో ఛాద‌ర్ ఘాట్ సీఐ రాజు రెండు టీంలుగా ఏర్పడి ఘటన జరిగిన ప్రాంతం చుట్టు పక్కలలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

సీసీ కెమెరాలలో రికార్డైన‌ దృశ్యాల‌ను ఆధారంగా చేసుకుని నిందితుడిని జకీర్ అలియాస్ బంటూగా నిర్దారించారు.. అనంత‌రం పోలీసులు జకీర్ ఇంటిపై ఏకకాలంలో దాడులు చేసి అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలోనూ పలు వాహనాలను దగ్ధం చేసినట్లుగా పోలీసులు నిందితుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనే పోలీసులు ఈ ఘటనపై ఇంకా విచారణ జరుపుతున్నట్లు స‌మాచారం.

Next Story