హైదరాబాద్‌ను ముంచెత్తిన అకాల వర్షం..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

భాగ్యనగరంలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

By -  Knakam Karthik
Published on : 24 March 2026 7:51 PM IST

Hyderabad, Sudden Rains, Telangana Weather, Traffic Alert, Hyderabad Traffic

హైదరాబాద్‌ను ముంచెత్తిన అకాల వర్షం..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్: భాగ్యనగరంలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకస్మాత్తు వర్షం కురిసింది. ముఖ్యంగా రాజేంద్రనగర్ పరిధిలో భారీ వర్షం పడగా, కూకట్‌పల్లి, KPHB, నిజాంపేట్, ముసాపేట్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో మోస్తరు వర్షం నమోదైంది. ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, మియాపూర్, చందనగర్, లింగంపల్లి పరిసరాల్లోనూ వాన దంచికొట్టింది.

నగర కేంద్ర ప్రాంతాలైన బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, నాంపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసింది. కుషాయిగూడ, కీసర, చర్లపల్లి, దమ్మాయిగూడ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం పడటంతో రహదారులపై నీరు నిలిచి ట్రాఫిక్ నెమ్మదించింది, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Next Story