హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం (Video)

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

By -  Knakam Karthik
Published on : 23 Feb 2026 7:04 PM IST

Hyderabad News, Weather Alert, Rain Update, Summer Rains, Thunderstorm

హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం (Video)

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుండగా.. ఎల్బీనగర్, ఉప్పల్, మలక్‌పేట్, చార్మినార్, వనస్థలిపురం ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ మరియు మధ్యప్రదేశ్ నుండి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. రాబోయే 24 నుండి 48 గంటల పాటు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

Next Story