సాధారణంగా మనం ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు డ్రా చేస్తే.. మన అకౌంట్ నుంచి మనీ కట్ అయి డబ్బులు వస్తాయి గదా. అయితే.. హైదరాబాద్ నగరంలోని ఓ ఎటీఎంలో వింత సమస్య చోటు చేసుకుంది. ఎటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేస్తే.. డబ్బులు డ్రా చేసిన వారి అకౌంట్ నుంచి కాకుండా బ్యాంకు మూలధనం నుంచి డబ్బులు డెబిట్ అవుతున్నాయి. ఇలా రూ.3.40లక్షలు విత్ డ్రా జరిగింది. ఈ ఘటన రాంనగర్‌లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో చోటు చేసుకుంది.
బ్యాంకు మూలధన అకౌంట్ నుంచి రూ.3.40లక్షలు విత్‌డ్రా అయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే.. సమస్యకు గల కారణాలు అంతుపట్టడం లేదు. సాఫ్ట్‌వేర్ లోపంతో సాంకేతిక ఆధారాలు లభించలేదు. ఒకే ఏటీఎం నుంచి నగదు డెబిట్ అవుతుండడంతో.. ఇది సైబర్ నేరగాళ్ల పనే అయివుంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై బ్యాంకు మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.