లగ్జరీ కారు ప్రమాదం.. కమెడియన్, వ్యాపారవేత్త ఉత్సవ్ దీక్షిత్‌ అరెస్ట్!

స్టాండ్-అప్ కమెడియన్, వ్యాపారవేత్త ఉత్సవ్ దీక్షిత్‌ను హైదరాబాద్ నగరంలోని KBR పార్క్ వద్ద పోర్షే ప్రమాదం ఘటనలో అరెస్టు చేశారు.

By Kalasani Durgapraveen  Published on  3 Nov 2024 4:30 PM IST
లగ్జరీ కారు ప్రమాదం.. కమెడియన్, వ్యాపారవేత్త ఉత్సవ్ దీక్షిత్‌ అరెస్ట్!

స్టాండ్-అప్ కమెడియన్, వ్యాపారవేత్త ఉత్సవ్ దీక్షిత్‌ను హైదరాబాద్ నగరంలోని KBR పార్క్ వద్ద పోర్షే ప్రమాదం ఘటనలో అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌కు చెందిన 33 ఏళ్ల దీక్షిత్‌ను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు ఆదివారం తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ ప్రహారీ గోడను లగ్జరీ కారుతో ఉత్సవ్ ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ప్రమాదంలో సరిహద్దు గోడ, గ్రిల్స్, పేవ్‌మెంట్‌కు గణనీయమైన నష్టం జరిగింది. బంజారాహిల్స్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సంఘటన తెల్లవారుజామున 5.45 గంటలకు జరిగింది. డయల్ 100కి ఒక పౌరుడు కాల్ చేయడంతో పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికిచేరుకున్నారు. కెబిఆర్ పార్క్ సరిహద్దు గోడను ఢీకొట్టిన రెడ్ కలర్ పోర్షే కారు చెట్టును ఢీకొట్టి గోడకు, గ్రిల్స్‌కు, పేవ్‌మెంట్‌కు తీవ్ర నష్టం కలిగించిందని పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది దీనిపై సుమోటో కేసు నమోదు చేశారు.

పోలీసు సిబ్బందికి కారుకు మొదట నంబర్ ప్లేట్ కనిపించలేదు. కారులో నంబరు TS10FH0900 నంబరు విరిగిన నంబర్ ప్లేట్ కనిపించింది. "కారు ముందు భాగం, చక్రాలు దెబ్బతిన్నాయి. కారు డ్రైవర్ తప్పించుకున్నాడు" అని పోలీసు అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story