హైదరాబాద్‌లో పెరుగుతున్న వైరల్‌ ఫ్లూ కేసులు.. వైద్యులు చెబుతోంది ఏమిటంటే?

హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో గత వారం రోజులుగా రోజుకు 600 నుంచి 800 వైరల్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 July 2024 10:45 AM IST
viral flu cases,  Hyderabad, health,

హైదరాబాద్‌లో పెరుగుతున్న వైరల్‌ ఫ్లూ కేసులు.. వైద్యులు చెబుతోంది ఏమిటంటే? 

హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో గత వారం రోజులుగా రోజుకు 600 నుంచి 800 వైరల్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. 10 రోజులకు పైగా జ్వరం తగ్గలేదని, జలుబు ఎక్కువగా ఉంటోందంటూ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. సీజనల్ ఫ్లూ, ఇన్‌ఫ్లుఎంజా లేదా ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ల కేసులా అని ప్రజలు భయపడుతూ ఉన్నారు. వైద్యులు, ఇమ్యునాలజిస్టులు, ప్రజారోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గత వారంలో ఇన్ఫెక్షన్ల పెరుగుదల సమాజంలో తెలియని వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశాన్ని సూచిస్తుంది.

తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం:

వైరల్ ఇన్‌ఫెక్షన్‌లలో ప్రస్తుత పెరుగుదల తీవ్రమైన న్యుమోనియాతో సహా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తుందని ఆందోళన నెలకొంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డేటా ధృవీకరించినట్లుగా, గత సంవత్సరం హైదరాబాద్ లో ఇన్‌ఫ్లుఎంజా A (H1N1), A (H3N2) కేసులలో ఇదే విధమైన గణనీయమైన పెరుగుదల కనిపించింది.

యశోద హాస్పిటల్స్‌కు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సోమనాథ్ కుమార్ మాట్లాడుతూ “వేసవిలో, మేము సాధారణంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు, గ్యాస్ట్రోఎంటెరిటిస్ కేసులను చూస్తాము. కానీ చాలా వరకూ చికెన్ పాక్స్, డిఫ్తీరియా, మీజిల్స్ వంటి ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయి." అని తెలిపారు. “కొన్ని సందర్భాల్లో, ఈ అంటువ్యాధులు ఎగువ, దిగువ శ్వాసనాళాలపై ప్రభావం చూపుతాయి, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. ఇది యాంటీవైరల్ డ్రగ్ ఒసెల్టామివిర్ (టామిఫ్లూ) అధిక వినియోగానికి దారితీసింది. కొంతమంది రోగులు, ముఖ్యంగా కొమొర్బిడ్ పరిస్థితులు ఉన్నవారు, తీవ్రమైన లక్షణాలను ఎదుర్కొంటున్నారని సూచిస్తుంది ” అని వివరించారు.

వైద్యుల పరిశీలనలు

హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ గీతా దేవి మాట్లాడుతూ “గత పది రోజులుగా ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా అవుతుండడం మేము చూస్తున్నాము. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇమ్యునోలాజికల్ మార్పుల కారణంగా, సాధారణ ఫ్లూ కూడా ఇప్పుడు శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లుగా తీవ్రమవుతోంది. ఈ పెరుగుదల న్యుమోనియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్లకు దారితీయదని ఆశిస్తున్నాను." అని తెలిపారు.

డాక్టర్ MV రావు కూడా వైద్యులను సంప్రదించాలని సూచించారు. “ప్రస్తుతం, మేము కొన్ని సీజనల్ ఫ్లూ కేసులను చూస్తున్నాము, ఇది వాతావరణ మార్పుల వల్ల సాధారణం. అప్పుడప్పుడు డెంగ్యూ కేసులు కూడా వస్తుంటాయి. ఆరోగ్యకరమైన, చురుకైన జీవితాన్ని గడపడం ద్వారా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.

ప్రభుత్వ సూచనలు:

జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, శరీర నొప్పులు లేదా కండ్లకలక, దగ్గు వంటి ఫ్లూ-వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు మూడు రోజుల కంటే ఎక్కువ కాలం పాటు లక్షణాలు కొనసాగితే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని ప్రభుత్వం ఒక సలహాను జారీ చేసింది. జ్వరం, తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, దగ్గు, శ్వాసలోపం, ఛాతీ రద్దీ, శరీరంలో నొప్పులు, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఫ్లూ ముఖ్య లక్షణాలు.

నివారణ చిట్కాలు

వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి, ప్రభుత్వం వీటిని పాటించాలంటూ సిఫార్సు చేస్తోంది:

- అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో కరచాలనం చేయడం.. ఆహారం, నీరు లేదా బట్టలు పంచుకోవడం మానుకోండి.

- తరచుగా చేతులు కడుక్కోండి. హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించండి.

- డోర్ హ్యాండిల్స్, టేబుల్ టాప్‌లు, రెయిలింగ్‌లు వంటి వాటిని తాకడాన్ని తగ్గించండి.

- తుమ్మేటప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు మీ నోటిని కప్పుకోండి.

- డిస్పోజబుల్ టిష్యూలను ఉపయోగించండి. ఉపయోగించిన తర్వాత వాటిని డస్ట్ బిన్ లో వేయండి.

- అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలకు కాల్ చేయండి.

ఫ్లూ షాట్ వ్యాక్సిన్‌ తీసుకోవడం:

చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు, ఆస్తమా రోగులు, గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ ఎంవి రావు సూచించారు. స్వైన్ ఫ్లూ ఉన్న గర్భిణీ స్త్రీలు గర్భస్రావాలు, మరణాలతో సహా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవచ్చు.

అపోలో హెల్త్‌కేర్‌లోని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఆశిష్ శంకర్ ఫ్లూ వ్యాక్సిన్‌ల ప్రాముఖ్యత గురించి తెలిసారు. “ఫ్లూ షాట్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలి. అన్ని టీకాలు తేలికపాటి దుష్ప్రభావాలను కలిగి ఉన్నప్పటికీ, ప్రయోజనాలు చాలా ఎక్కువ. హ్యాండ్‌షేక్‌లను నివారించండి, తరచుగా చేతులు కడుక్కోండి. మీ ముఖాన్ని తాకకుండా ఉండండి." అని శంకర్ సూచించారు.

Next Story