హైదరాబాద్‌లో చైనా మాంజాలపై స్పెషల్ డ్రైవ్.. రూ.43 లక్షల విలువైన బాబిన్లు స్వాధీనం

హైదరాబాద్ నగరవ్యాప్తంగా చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లోనే...

By -  అంజి
Published on : 12 Jan 2026 1:49 PM IST

Special drive, Chinese manja, Hyderabad, Bobbins

హైదరాబాద్‌లో చైనా మాంజాలపై స్పెషల్ డ్రైవ్.. రూ.43 లక్షల విలువైన బాబిన్లు స్వాధీనం

హైదరాబాద్ నగరవ్యాప్తంగా చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లోనే (ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు) రూ. 43 లక్షల విలువైన 2,150 బాబిన్లను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ నిషేధిత మాంజాను విక్రయిస్తున్న వ్యవహారంలో 29 కేసులు నమోదు చేసి.. 57 మందిని అరెస్ట్ చేశారు.

ఇక గత నెల రోజుల్లో నమోదైన 132 కేసుల్లో.. రూ. 1.68 కోట్ల విలువైన 8,376 బాబిన్లను స్వాధీనం చేసుకొని, మొత్తంగా 200 మందిని అరెస్ట్ చేశారు. నిషేధిత మాంజాను విక్రయించినా, కొనుగోలు చేసినా జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సురక్షితమైన దారాలనే వాడుతూ, ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. చైనీస్ మాంజాను దాచినా, అమ్మినా, వాడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగర సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

ఇలాంటి మాంజా విక్రయాలు ఎక్కడైనా కనిపిస్తే 94906 16555 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలంటే చైనీస్ మాంజాకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story