ప్రయాణీకులకు అలర్ట్.. 34 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
South Central Railway Cancels 34 MMTS Trains in Hyderabad today.ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య
By తోట వంశీ కుమార్
ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే షాకిచ్చింది. నగరంలో నేడు(ఆదివారం) పలు ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. సాంకేతిక కారణాల వల్ల మొత్తం 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసుల చొప్పున ఉండగా, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో ఒక్కో సర్వీసు చొప్పున రద్దు చేశారు.
రద్దు అయిన రైళ్ల వివరాలు ఇవే..
- లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల రైళ్లను
- హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబర్ గల రైళ్లను
- ఫలక్ నూమా-లింగంపల్లి మార్గంలో 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్ గల రైళ్లను
- లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 నంబర్ గల రైళ్లను
- సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 47150 నంబర్ గల సర్వీసును
- లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో 47195 నంబర్ గల సర్వీసును రద్దు చేసినట్లు తెలిపారు.
Cancellation of MMTS Train Services on 12th June, 2022 ( Sunday) @drmhyb @drmhyb pic.twitter.com/s6qkSwNb9F
— South Central Railway (@SCRailwayIndia) June 11, 2022
సాధారణంగా సెలవు దినాల్లో ఎక్కువగా ప్రయాణికుల రద్దీ ఉండదన్న కారణంతో ఎంఎంటీఎస్ పలు సర్వీసులను రద్దు చేస్తూ ఉంటారు. అయితే.. నేడు టెట్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయడంతో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.