రూ.10 లక్షలు డిమాండ్ చేశాడంటూ పంజాగుట్ట పీఎస్‌లో మంగ్లీ ఫిర్యాదు!

ప్రముఖ సింగర్ మంగ్లీ ఆదివారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు

By -  Knakam Karthik
Published on : 12 April 2026 6:00 PM IST

Hyderabad News, PunjaguttaPolice, SingerMangli, ExtortionCase, Defamation

రూ.10 లక్షలు డిమాండ్ చేశాడంటూ పంజాగుట్ట పీఎస్‌లో మంగ్లీ ఫిర్యాదు!

ప్రముఖ సింగర్ మంగ్లీ ఆదివారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సింగపోగు సుబ్బు అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో, మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు వ్యక్తి గతంలో తన కార్యాలయం వద్దకు వచ్చి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని, ఆ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో కక్షగట్టి దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగుతున్నాడని మంగ్లీ పోలీసులకు వివరించారు.

అయితే, ఈ వివాదానికి మరో కోణం కూడా ఉంది. అంతకుముందే అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు మంగ్లీపై ఫిర్యాదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో ఆమె సుమారు 10 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మంగ్లీ స్పందిస్తూ, తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఉద్దేశపూర్వకంగానే తనను వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. ఇరుపక్షాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగ్లీ పంజాగుట్ట స్టేషన్‌కు రావడంతో అక్కడ కాసేపు సందడి నెలకొంది.

Next Story