Hyderabad: అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్లతో శ్రీ ప్రియాంక సంస్థ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు
అధిక వడ్డీల ఆశ చూపి రెండు వందల కోట్లతో హైదరాబాద్‌లో అబిడ్స్‌లోని శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ బోర్డు తిప్పేసింది.
By అంజి Published on 20 May 2024 4:12 PM ISTHyderabad: అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్లతో శ్రీ ప్రియాంక సంస్థ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు
హైదరాబాద్: అధిక వడ్డీల ఆశ చూపి రూ.200 కోట్లతో అబిడ్స్‌లోని శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ భిచనా ఎత్తివేసింది. ఆ సంస్థ తమను మోసం చేసిందని, న్యాయం చేయాలని బషీర్‌బాగ్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ దగ్గర బాధితుల ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వడ్డీ పేరుతో మోసం చేశారని 517 మంది బాధితులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అబిడ్స్‌లోని శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పేరుతో సంస్థను ఓ భార్య భర్తలు తమ కుమారుడితో కలిసి ప్రారంభించారు. అమాయకమైన వినియోగదారులకు అధిక వడ్డీ పేరుతో గాలం వేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి.. తీరా రెండు వందల కోట్ల రూపాయల వరకు వసూలు కాగానే భిచానా ఎత్తేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అబిడ్స్‌లోని తెలంగాణ స్టేట్ కోఆపారేటివ్ బ్యాంక్‌లో జనరల్ మేనేజర్‌గా నిమ్మగడ్డ వాణి బాల పని చేస్తోంది. అయితే ఆమె భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు కలిసి అబిడ్స్ లో శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు.
తెలంగాణ స్టేట్ కోఆపారేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్న నిమ్మగడ్డ వాణి బాల బ్యాంక్ కు వచ్చి డిపాజిట్ చేయాలనుకున్న వినియోగదారులను ఆకర్షించి వారిని అదే బ్యాంక్ సమీపంలో తన భర్తతో ఓపెన్ చేయించిన శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్‌కి పంపి అధిక వడ్డీ ఇస్తామంటూ మాయమాటలు చెప్పి వారి చేత డిపాజిట్ చేయించుకున్నారు. ఈ విధంగా తన కొడుకుతో కలిసి దంపతులిద్దరూ అధిక వడ్డీ పేరుతో 200 కోట్ల రూపాయలను వసూలు చేస్తూ.. భారీ కుంభకోణానికి పాల్పడ్డారు.
తమకు న్యాయం చేయాలని బషీర్ బాగ్ లోని హైదరాబాద్ సీసీస్ పోలీసు స్టేషన్ ముందు బాదితులు ఆందోళనకు దిగారు. అబిడ్స్ లోని శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ యజమాన్యం డిపాజిట్ ల రూపంలో తీసుకొని అధిక వడ్డీలు ఇస్తామని నమ్మ బలికి 517 మంది వద్ద నుండి డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.